జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » లష్కర్‌తో పాకిస్థాన్‌కు సంబంధాలు నిజమే: చిదంబరం (Pakistan | Chidambaram | Home Ministry | Mumbai | FBI | Lashkar)
Feedback Print Bookmark and Share
 
భారత్‌లో దాడులకు పాల్పడుతున్న లష్కర్ ఇ తోయిబా తీవ్రవాద సంస్థతో పాకిస్థాన్‌కు సంబంధం ఉన్నాయని కేంద్ర హోంమంత్రి చిదంబరం ఆరోపించారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తుల వద్ద జరిపిన విచారణలో ఈ విషయం స్పష్టమైందన్నారు.

హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడెమీలో ఐపీఎస్ అధికారుల ఔట్‌పాసింగ్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌బీఐ అరెస్టు చేసిన లష్కర్ తోయిబాకు చెందిన డేవిడ్ హ్యాడ్లీ, తన్వార్ రాణాలతో ఇది నిర్ధారణ అయిందన్నారు.

పాక్ కేంద్రంగా పని చేస్తున్న లష్కర్ తోయిబా సంస్థ భారత్‌లో మరిన్ని దాడులకు వ్యూహం పన్నినట్టు వీరివద్ద జరిగిన విచారణలో తెలిసిందన్నారు. హ్యాడ్లీ పలుమార్లు పాక్‌కు వెళ్లి లష్కర్ నేతలతో సంప్రదింపులు జరిపినట్టు వెల్లడైందన్నారు. ఇది లష్కర్ సంస్థకు పాక్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రుజువు చేస్తోందన్నారు.

ఇకపోతే.. మావోయిస్టులపై ఎలాంటి సైనిక ఆపరేషన్ చేపట్టలేదన్నారు. గ్రీన్ హంట్ వంటి ఆపరేషన్లు ఏవీలేవని తేల్చి చెప్పారు. అలాగే మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలను మొహరించారన్న వార్తల్లో నిజం లేదని మంత్రి చిదంబరం స్పష్టం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.