జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ముషారఫ్‌‍ను కూడా విచారిస్తాం: ఐరాస (Pakisthan | President | Pravej Musharraf | UNO)
Feedback Print Bookmark and Share
 
పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య జరిగిన తీరుపై ఐక్యరాజ్యసమితి దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అప్పటి ఆ దేశాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను కూడా తాము ప్రశ్నించాలని నిర్ణయించినట్లు ఐరాస తెలిపింది.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఐరాస కమీషనర్ మార్క్ క్వార్టర్ మ్యాన్ నుంచి ఓ లేఖ అందింది. ఇందులో ముషారఫ్‌ను తాము విచారించాలనుకుంటున్నామని, దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని ఐరాస ఆ లేఖలో కోరింది.

ఇదిలావుండగా ఐరాస విచారణ బృందం ముషారఫ్‌తోపాటు ఐఎస్ఐ, పాక్ సైన్యంలోని ఇతర ఉన్నతాధికారులతో సమావేశం అయ్యేందుకు తాము నిర్ణయించినట్లు ఐరాస పేర్కొంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.