ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కర్నాటక రాష్ట్ర మంత్రి వర్గం నుంచి శోభా తొలగింపు (Karnataka | CM | Yadyurappa | Shobha | Politics | Gali Brothers)
కర్నాటక రాష్ట్ర మంత్రివర్గం నుంచి శోభాకరంద్లాజేని తొలగిస్తున్నట్లు ఆ పార్టీ అగ్రనేతలు నిర్ణయించినట్లు ప్రాథమిక సమాచారం.
కర్నాటక రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారణమైన శోభను తొలగించి సంక్షోభానికి తెరదించేందుకు ప్రయత్నాల్లో భాగంగా శోభను తొలగించినట్లు భారతీయ జనతా పార్టీ తెలిపింది.
గ్రామీణాభివృద్ధి శాఖమంత్రిగానున్న శోభ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అత్యంత సన్నిహితురాలిగా పేరొందారు.
ఇదిలావుండగా అసమ్మతి నేతల షరతులకు కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీబాటలో పయనించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అసమ్మతి నాయకులతో సర్దుబాటు చేసుకునేందుకుగాను అధికారుల మార్పు, మంత్రివర్గంలో మార్పులు చేసేందుకు ఆయన అంగీకరించినట్లు ప్రాథమిక సమాచారం.
కాగా అసమ్మతి నేత గాలి జనార్ధన్ రెడ్డి విధించిన షరతుల మేరకే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో గాలి బ్రదర్స్ పంతం నెగ్గించుకున్నట్లైంది.