జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » నేడు కొలువుదీరనున్న మహా ప్రభుత్వం! (Maharashtra | New Govt | Ashok Chawan | Congress | NCP | Jameer)
Feedback Print Bookmark and Share
 
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం శనివారం కొలువుదీరనుంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై పక్షం రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభన ఎట్టకేలకు 48 గంటల క్రితం ముగిసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం శనివారం ప్రమాణం చేయనుంది.

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు తమకు ఉందని తెలుపుతూ 170 మంది సభ్యులతో కూడిన మద్దతు లేఖను రాష్ట్ర గవర్నర్ జమీర్‌కు కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు శుక్రవారమే సమర్పించారు.

కాగా, కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కాంగ్రెస్ తరపున 23 మంది ఎన్సీపీ తరుపున 20 మంది సభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందులో ఎన్సీపీకి చెందిన మంత్రులందరూ శనివారమే ప్రమాణం స్వీకారం చేస్తుండగా, కాంగ్రెస్ మంత్రులు మాత్రం రెండు దశల్లో ప్రమాణం చేయనున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.