జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఏడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఉప ఎన్నికల పోలింగ్! (Seven States | By Poll | Polling | CEC | UP | Loksabha | Election | Counting)
Feedback Print Bookmark and Share
 
ఏడు రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక లోక్‌సభకు శనివారం ఉదయం ఆరంభమైన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఈ పోలింగ్ సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఫిరోజాబాద్‌ లోక్‌సభ స్థానంతో పాటు 11 శాసనసభ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ జరుగుతంది. అలాగే, పశ్చిమబెంగాల్‌లో 10, కేరళలో మూడు, రాజస్థాన్‌, అస్సోంలలో రెండేసి స్థానాలు, హిమాచల్‌ ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి కూడా ఈ పోలింగ్ ప్రశాతంగా సాగుతోంది.

ఇదిలావుండగా, ఉప ఎన్నికల జరుగుతున్న లోక్‌సభ బరిలో ములాయంసింగ్ కోడలు పోటీ చేస్తున్నారు. ఆమెపై ములాయం పార్టీకి చెందిన మాజీ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి, బాలీవుడ్ దిగ్గజం రాజ్‌బబ్బర్ పోటీ చేస్తుండటం గమనార్హం. వీరికోసం జరిపిన ఎన్నికల ప్రచారం రాజకీయ నేతల దృష్టిని బాగానే ఆకర్షించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.