జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఆటపై దృష్టి ఉంచు.. రాజకీయాలపై కాదు: బాల్‌థాక్రే (Sachin Tendulkar | Shiv Sena | Bala Saheb Thackrey | Focus | Cricket)
Feedback Print Bookmark and Share
 
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ శివసేన చీఫ్ బాల్‌థాక్రే ఆగ్రహానికి గురయ్యారు. సచిన్ రాజకీయాల్లోకి తలదూర్చకుండా.. ఆటపై దృష్టి కేంద్రీకరించాలని థాక్రే సూచించారు. దీంతో మహారాష్ట్రలో సరికొత్త వివాదానికి దారితీస్తోంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో 20 సంవత్సరాల కెరీర్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా సచిన్ ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. ముంబైపై ప్రతి భారతీయునికి సమాన హక్కులు ఉన్నాయి. ముంబై నగరం భారత్‌లో ఒక భాగం అని అన్నారు. దీనిపై శివసేన చీఫ్ థాక్రే మండిపడ్డారు. ఆ పార్టీ పత్రిక సామ్నాలో సచిన్‌పై విమర్శలు గుప్పించారు.

సచిన్ చేసిన వ్యాఖ్యలు మరాఠీల మనస్సును గాయపరిచాయని థాక్రే పేర్కొన్నారు. ఒక మరాఠీయునిగా కంటే భారతీయుడిగాే గర్వపడుతున్నట్టు సచిన్ చేసిన వ్యాఖ్యలు తమ మనస్సులను గాయపరిచాయని అన్నారు. ముంబై నగరంపై ప్రతి భారతీయునికి సమాన హక్కులు ఉన్నాయని సచిన్ చేసిన వ్యాఖ్యలతో తాము విభేదిస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా, రాజకీయాల్లో తలదూర్చకుండా క్రికెట్‌పై మనస్సు లగ్నం చేయాలని హితపు పలికారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.