జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » తనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించండి: అబూ అజ్మీ (Z category | Security | Abu Azmi | SP MLA | Maharashtra | MNS attack)
Feedback Print Bookmark and Share
 
తనకు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించాలని సమాజ్‌వాది పార్టీకి చెందిన శాసనసభ్యుడు అబూ అజ్మీ మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మహారాష్ట్ర హో మంత్రి ఆర్.ఆర్.పాటిల్‌ను కలుసుకుని వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ శాసనసభా నేత అబూ అజ్మీ మాట్లాడుతూ.. రాజ్‌థాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్, శివసేన పార్టీలకు చెందిన కార్యకర్తల నుంచి తమకు బెదరింపులు వస్తున్నాయని అందువల్ల తమ పార్టీ సభ్యులంతా హోం మంత్రి పాటిల్‌ను కలిసి జెడ్‌ కేటగిరీ భద్రతను కల్పించాలని కోరినట్టు చెప్పారు.

బాలాసాహెబ్‌ థాక్రేపై తాము చేసిన కొన్ని వ్యాఖ్యలకు నిరసనగా అసెంబ్లీ వెలుపల శివసేన కార్యకర్తలు కూడా తనను ఘెరావ్‌ చేశారని గుర్తు చేశారు. ఈ అంశాలన్నింటినీ పరిగణంలోకి తీసుకుని తమకు జడ్ కేటగిరీ భద్రతను కల్పించాలని కోరినట్టు చెప్పారు.

ఇదిలావుండగా, హిందీలో ప్రమాణ స్వీకారం చేసినందుకు గాను.. అబూ అజ్మీపై ఎంఎన్ఎస్ శాసనసభ్యులు గూండాల్లా ప్రవర్తించి దాడి చేసిన విషయం తెల్సిందే. దీనికి సంబంధించి దాడి చేసిన నలుగురు ఎమ్మెల్యేలపై నాలుగేళ్ళ పాటు బహిష్కరణ వేటు వేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.