జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కాలం ముగియక ముందే తప్పుకుంటా: రాజ్‌నాథ్ సింగ్ (Rajanth Singh | BJP | Gadkari | Advani | RSS | President)
Feedback Print Bookmark and Share
 
తన పదవీకాలం ముగియకముందే భారతీయ జనతా పార్టీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్టు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తన స్థానంలో మహారాష్ట్రకు చెందిన నితిన్‌ గడ్కారీ నియమితులయ్యే అవకాశాలు ఉన్నట్టు ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు.

ఇదిలావుండగా, రాజ్‌నాథ్ పదవీకాలం వచ్చే నెలాఖరుతో ముగియనుంది. అంతకు ముందే రాజీనామా చేయనున్నట్టు ఆయనే స్వయంగా వెల్లడించడం గమనార్హం. కాగా, గడ్కారీ డిసెంబర్‌లో పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. డిసెంబరు మూడోవారంలో నిర్వహించనున్న భాజపా జాతీయ కౌన్సిల్‌ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా గడ్కారీ పేరు అధికారికంగా ప్రటిస్తారు.

గడ్కారీకి ఈ పదవి కట్టబెట్టడంపై అగ్రనేత అద్వానీకి మొదటి నుంచి ఇష్టం లేకపోయినప్పటికీ.. మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ అగ్రనేతల ఒత్తిడికి ఆయన తలొగ్గాల్సి వచ్చింది. జాతీయ స్థాయిలో పార్టీని నడిపించగల సత్తా, గుర్తింపు అతనికి లేవని అద్వానీ పలుమార్లు బహిరంగంగానే అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై కమలనాథుల్లో కూడా అంతర్మథనం జరిగింది. అయితే, ఆర్ఎస్ఎస్ నేతల ముందు ఇవేమీ పనిచేయలేక పోయాయి. ఫలితంగా గడ్కారీ పేరును ఖరారు చేసినట్టు సమాచారం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.