జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » శబరిమలైకు 420 ప్రత్యేక రైళ్లు: రైల్వే మంత్రి అహ్మెద్ (Special trains | Makaravilakku fest | E.Ahamed | Sabarimalai | Railways)
Feedback Print Bookmark and Share
 
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలైకు 420 ప్రత్యేక రైలు సర్వీసులను నడుపనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి ఇ.అహ్మెద్ తెలిపారు. మకరవిలక్కు ఫెస్టివల్ (కార్తీక దీపోత్సవాలు)ను పురస్కరించుకుని దేశం నలుమూలల నుంచి శబరిమలైకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ సర్వీసులను నడుపనున్నట్టు చెప్పారు.

దీనిపై ఆయన మంగళవారం రాత్రి కొచ్చిలో విలేకరులతో మాట్లాడుతూ.. సౌత్ సెంట్రల్ అండ్ వెస్ట్రన్ రైల్వే 262 రైళ్లను నడుపుతుందన్నారు. గత యేడాది 210 రైలు సర్వీసులను నడిపినట్టు చెప్పారు. మరో 158 రైలు సర్వీసులను దక్షిణ రైల్వే నడుపుతుందన్నారు. గతయేడాది ఈ సంఖ్య 138గా ఉన్నట్టు వివరించారు.

అంతేకాకుండా, కొచ్చువెలి-మంగుళూరు ఎక్స్‌ప్రెస్ రైలును తిరువనంతపురం వరకు పొడగించనున్నట్టు తెలిపారు. ప్రయాణికుల భద్రతే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం రైల్వే సేఫ్టీ కమిషన్ క్రమం తప్పకుండా సమావేశమవుతూ లోపాలను సరిద్దిద్దుతోందన్నారు. ఈ సందర్భంగా మంత్రి అహ్మెద్ తిరువనంతపురం-ఎర్నాకులం ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును గురువాయూర్ వరకు పొడగిస్తూ జెండా ఊపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.