జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » రాహుల్‌ను నిందితునిగా పరిగణించలేం: ముంబై కమిషనర్ (Rahul Bhat | Mahesh Bhat | Headly | Rahul Maria | 26/11 attacks)
Feedback Print Bookmark and Share
 
బాలీవుడ్ నటుడు రాహుల్ భట్‌ను ముంబై దాడుల కేసుల్లో ఒక నిందితునిగా పరిగణించలేమని, అయితే, ఒక సాక్షిగా చూస్తున్నట్టు ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియా తెలిపారు. రాహుల్‌ స్వచ్ఛందంగా వచ్చి సమాచారం తెలిపారన్నారు. అందువల్ల ఆయనను నిందితుడిగా పరిగణించలేమన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర హోమంత్రిత్వ శాఖ వర్గాలు కూడా స్పష్టం చేసిన విషయం తెల్సిందే.

అయితే, తనకు తెలియకుండానే ఉగ్రవాది డెవిడ్ హెడ్లీకి ఉపయోగపడివుండవచ్చని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల ఆ కోణంలో విచారణ సాగిస్తున్నట్టు వారు తెలిపారు. అంతేకాకుండా హెడ్లీ ద్వారా లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థ దాడులకు తెగబడేందుకు ఎంచుకున్న లక్ష్యాల కోసం రాహుల్‌ను పావుగా ఎంచుకున్నట్టు తెలుస్తోందన్నారు.

ఇందుకోసం భారత్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన హెడ్లీ.. రాహుల్‌తో కలిసి తిరగడం వల్ల ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహించారన్నారు. 2006 నవంబరు 2008 మార్చి మధ్యకాలంలో హెడ్లీ ఈ లక్ష్యాల వద్ద రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోందన్నారు. అదే సమయంలో హెడ్లీ కుట్ర లేదా దురుద్దేశం, లష్కర్‌ తోయిబా నేతలతో శాటిలైట్ ఫోన్‌లో మాట్లాడిన కోడ్ భాష రాహుల్‌కు తెలిసి ఉండకపోవచ్చన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.