జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఫలించిన రాహుల్ గాంధీ కృషి: బుందేల్‌ఖండ్‌కు ప్యాకేజీ! (Rahul Gandhi | Bundel Khand | UP | MP | Districts | PM | Package)
Feedback Print Bookmark and Share
 
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కృషి ఫలించింది. ఉత్తరప్రదేశ్-మధ్యప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లోని బుందేల్‌ఖండ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇందుకోసం 7,266 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేయనుంది. ఇందుకోసం స్వయంప్రతిపత్తి కలిగిన ఒక సంస్థను ఏర్పాటు చేయాలని రాహుల్ సూచించగా, దీన్ని కేంద్రం తోసిపుచ్చింది.

ఫలితంగా సంస్థకు బదులు పర్యవేక్షక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఇరు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఇన్‌చార్జ్‌లు ఉంటారు. ప్రణాళికా సంఘం సభ్యులు, ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నేతృత్వం వహిస్తారని కేంద్రం ప్రకటింటింది.

బుందేల్‌ఖండ్‌లో గతయేడాది పర్యటించిన రాహుల్.. స్థానిక పరిస్థితులపై ఒక నివేదిక తయారు చేసి కేంద్రానికి సమర్పించారు. ఇందులో ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కోరారు. అంతేకాకుండా, ప్రధానితో కూడా సమావేశమైన రాహుల్ ఈ అంశంపై చర్చించారు.

ఫలితంగా కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ నిధులతో యూపీఏలో ఏడు, ఎంపీలో ఆరు జిల్లాల్లో నీటి వనరుల పెంపు, వాననీటి సంరక్షణ చర్యలు చేపడుతారని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అంబికా సోనీ తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.