జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: ప్రధాని (Pakistan | Manmohan Singh | Terrorism | America | Washington)
Feedback Print Bookmark and Share
 
దాయాది దేశం పాకిస్థాన్‌తో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ మరోమారు స్పష్టం చేశారు. ఇందుకోసం ఆయన ఒక షరతు విధించారు. పాక్ గడ్డపై నుంచి భారత్‌పైకి తీవ్రవాద దాడులు జరుగకుండా చూడాలన్ని ప్రధాన షరతుగా ఆయన చెప్పుకొచ్చారు.

నాలుగు రోజుల పర్యటన కోసం ప్రధాని అమెరికాకు చేరుకున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా.. ఆయన వాషింగ్టన్‌కు చెందిన ఒక వార్తా పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. తీవ్రవాదమే ఒక అజెండా చేసుకుని పాకిస్థాన్ వ్యవహరిస్తోదంని ఆరోపించారు.

పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాద బాధిత దేశంగా భారత్ ఉందన్నారు. ముంబై తరహా దాడులు జరిపేందుకు పాక్ గడ్డపై నుంచి తీవ్రవాదులు వ్యూహ రచన చేస్తున్నట్టు నిఘా వర్గాలు నుంచి ప్రతిరోజూ సమాచారం వస్తూనే ఉందని గుర్తు చేశారు.

అదేసమయంలో భారత్‌ను చూసి పాకిస్థాన్ భయపడాల్సిన పని లేదన్నారు. ఇందుకోసం తీవ్రవాదం అనే అజెండాతో పని చేయాల్సిన పని అంతకంటే లేదని ప్రధాని దాయాది దేశానికి భరోసా ఇచ్చారు.

గత 25 సంవత్సరాలుగా సీమాంతర ఉగ్రవాదంతో భారత్ సతమతమవుతోందన్నారు. ఇలాంటి తరుణంలో అమెరికా తన శక్తిని ఉపయోగించి పాకిస్థాన్‌పై మరింత ఒత్తిడి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.