కాంగ్రెస్ వృద్ద సీనియర్ నేత, మాజీ మంత్రి బి.శంకరానంద్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆయన కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కిడ్నీ పని చేయకపోవడమే కాకుండా.. గుండెపోటు రావడంతో ఆయనను బెల్గాంలోని కేఎల్‌ఇ సొసైటీ మిడికల్ కళాశాల ఆస్పత్రిలో చేర్చారు. ఈయనకు ఇదిదరు కురుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.
గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఈయన.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ.నరసింహారావు మంత్రివర్గాల్లో కేంద్ర మంత్రిగా పని చేశారు. చిక్కోడి రిజర్వుడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికైన ఘనత సాధించారు. భోఫోర్స్ కేసును విచారించేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీకి శంకరానంద్ నేతృత్వం వహించారు.