జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » పార్లమెంట్‍‌లో చెరకు దడ: రెండు రోజుల వాయిదా! (Govt | discussions | party leaders | sugarcane issue | Pranab Mukharji)
Feedback Print Bookmark and Share
 
చెరకు మద్దతు ధరపై పార్లమెంట్ మరోమారు దద్ధరిల్లింది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం రెండో రోజు సమావేశమైన పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలు చెరకు మద్దతు ధరపై పట్టుబట్టాయి. ఫలితంగా సభా కార్యక్రమాలకు తీవ్ర ఆంటంకం కలిగింది. దీంతో స్పీకర్ మీరా కుమార్ తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

ఆ తర్వాత సభ ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం తమ పట్టు వీడలేదు. దీంతో సభను సోమవారానికి స్పీకర్ వాయిదా వేశారు. ఇదిలావుండగా, చెరకు మద్దతు ధరపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష నేతలతో భేటీకావాలని నిర్ణయించింది. ఇందులో.. భాజపా ప్రతిపక్ష నేత ఎల్కే.అద్వానీ, ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, ఆర్.ఎల్.డి నేత అజిత్ సింగ్ తదితరులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

ఈ సమావేశాన్ని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముందుగా ఆయన యూపీఏ భాగస్వామ్య పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. ఇందులో చెరకు మద్దతు ధరపై చర్చిస్తారు. అవసరమైతే షుగర్‌కేన్ కంట్రోల్ ఆర్డినెన్స్‌లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.