ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » భారత్‌లో రోజుకు ఐదు వేల మంది చిన్నారుల మృతి (children | India | Die | everyday | UNICEF | Malnutrition | Women | mortality)
దేశంలో రోజుకు ఐదువేల మంది చిన్నారులు మృతి చెందుతున్నట్టు అంతర్జాతీయ స్వచ్చంధ సంస్థ యునిసెఫ్ తాజాగా నివేదిక పేర్కొంది. దేశ వ్యాప్తంగా శిశు మరణాల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. నివారించలేని వ్యాధులే ఇందుకో ప్రధాన కారణమని ఆ నివేదిక తేల్చింది.
దేశంలో శిశుమరణాల సంఖ్య నూటికి ఐదు శాతంగా ఉంది. 96 శాతం మంది చిన్నారులు షెడ్యూల్ తెగకు చెందిన వర్గంలోనూ, 88 శాతం చిన్నారులు షెడ్యూల్ కులానికి చెందిన వర్గంలోనూ, 59 శాతం మంది ఇతర సామాజిక వర్గాల్లో మృతి చెందుతున్నట్టు తెలిపింది.
చిన్న వయస్సులోనే వివాహాలు కావడం, మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ లేకపోవడమే శిశుమరణాల సంఖ్యకు ప్రధాన కారణంగా భారత్‌లోని యునిసెఫ్ ప్రతినిధి కరణ్ హాల్షఫ్ అభిప్రాయపడ్డారు. దేశంలో పౌషకాహార లోపంతో మరణించే శిశువుల సంఖ్య ఎక్కువగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. ఇందులో ఐదు సంవత్సరాల లోపు వయస్సు గలిగి చిన్నారులే ఎక్కువగా ఉన్నారన్నారు.