జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మావోయిస్టులు తీవ్రవాదులతో సమానం: జీకే.పిళ్లై (Maoists | Naxals | terrorists | Union Home Secy | Orissa)
Feedback Print Bookmark and Share
 
దేశంలో విధ్వంసం సృష్టిస్తున్న మావోయిస్టులు తీవ్రవాదులతో సమానమని కేంద్ర హోంశాఖ కార్యదర్శి జీకే.పిళ్లై అభిప్రాయపడ్డారు. అందువల్ల వారిపై తనకు ఎలాంటి సానుభూతి లేదని ఆయన తెగేసి చెప్పారు. ఆయన శుక్రవారం ఒరిస్సా ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు.

అనంతరం పిళ్లై మీడియాతో మాట్లాడుతూ.. తీవ్రవాదులకు, మావోయిస్టులకు ఎలాంటి వ్యత్యాసం లేదు. రైల్వే స్టేషన్లు, రైళ్లు, మొబైల్ టవర్లు, పాఠశాల భవనాలను పేల్చి వేయడం తమ లక్ష్యాలుగా మావోయిస్టులు ఎంచుకుంటారన్నారు. తాజాగా పశ్చిమబెంగాల్‌లో అదుపులోకి తీసుకున్నారు. అందువల్ల వీరిపై తనకు ఎలాంటి సానుభూతి లేదని ఆయన స్పష్టం చేశారు.

దట్టమైన అడవుల్లో దాగివున్న మావోయిస్టులపై వైమానికి దాడులు చేసే స్థాయికి తాము వెళ్లబోమని స్పష్టం చేశారు. అయితే, ఒరిస్సా ప్రభుత్వం చేపట్టిన మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల కోసం హెలికాఫ్టర్‌ను సమకూర్చాలన్నది తమ ప్రతిపాదనగా ఉందన్నారు. ఇందుకోసం కేంద్ర ఐదు కోట్ల రూపాయల గ్రాంటును మంజూరు చేసిందన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.