జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » రూ.12.41 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం: ప్రభుత్వం (Fake notes | seize | Government | FM | Namo Narain Meena | Rajyasabha)
Feedback Print Bookmark and Share
 
ఈ యేడాది సెప్టెంబరు నెలాఖరునాటికి 12.41 కోట్ల రూపాయల విలువ చేసే నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదే 2008 సంవత్సరంలో 25.79 కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమో నారేమ్ మీనా శుక్రవారం లోక్‌సభకు వివరించారు.

దీనిపై మంత్రి మీనా సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జనవరి-సెప్టెంబరు మధ్య కాలంలో 339981 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వీటి విలువ రూ.12.41 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. దిగువసభలో ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆమె జవాబిచ్చారు.

ఈ మేరకు నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో వెల్లడించినట్టు ఆమె తెలిపారు. 164252 నకిలీ నోట్లలో 500 రూపాయి నోట్ల విలువ రూ.8.21 కోట్లుగా ఉన్నట్టు వివరించారు. నకిలీ నోట్ల చెలామణిని సీబీఐతో పాటు.. నోడల్ ఏజెన్సీలు నిశితంగా పరిశీలిస్తున్నాయని మంత్రి మీనా సభకు తెలియజేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.