జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » న్యూఢిల్లీకి చేరుకున్న సీఐఏ డైరక్టర్ పనెట్టా (CIA chief | India visit | NSA | Panetta | MK Narayanan | Pakistan)
Feedback Print Bookmark and Share
 
తీగ లాగితో డొంక కదిలిన చందంగా ముంబై దాడులు దర్యాప్తు సాగుతోంది. తీవ్రవాదుల లక్ష్యాలకు మార్గదర్శకులుగా భావిస్తున్న లష్కర్ తోయిబా తీవ్రవాది, అమెరికా పౌరుడు డేవిడ్ హెడ్లీ, కెనడా పౌరుడు రాణాలను ఎఫ్‌బీఐ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా దర్యాప్తు సంస్థ సీఐఏ డైర్కటర్ లీయాన్ ఇ పనెట్టా శనివారం మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు చేరుకున్నారు. ఆయన జాతీయ భద్రతా సలహాదారు ఎంకే.నారాయణతో భేటీ అయ్యారు.

తీవ్రవాదంపై ఉన్నత స్థాయి నిపుణుల సహకారం, నిఘా వర్గాల సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, ఇతర అంశాలు ప్రధాన అజెండాలుగా ఆయన పర్యటన సాగనుంది. అంతేకాకుండా, హెడ్లీ, హుస్సేన్ రాణాల వద్ద ఎఫ్‌బీఐ జరిపిన విచారణలో వెల్లడైన అంశాలను కూడా పంచుకోనున్నారు.

కాగా, సీఐఏ చీఫ్ ఇస్లామాబాద్ నుంచి నేరుగా న్యూఢిల్లీకి చేరుకున్నారు. పాక్‌ పర్యటనలో ఆయన ఆ దేశ పౌర, సైనిక ఉన్నతాధికారులతో సమావేశమై తీవ్రవాదంపై పాక్ చేస్తున్న పోరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న తీవ్రవాదులను ఏరివేసేందుకు పాకిస్థాన్, అమెరికా కలిసి సంయుక్త పోరు సాగిస్తున్న విషయం తెల్సిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.