ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మీడియా సంస్థపై దాడి: కస్టడీకి సేన కార్యకర్తలు (Shiv Sena | Media | IBN-Lokmat | Media | Police custody | Court)
ముంబైలోని ఐబీఎన్ లోక్‌మత్ మరాఠీ న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడి చేసిన కేసులో 17 మంది శివసేన కార్యకర్తలను స్థానిక కోర్టు పోలీలు కస్టడీకి పంపించింది. ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం నిందితులను కస్టడీకి అనుమతి ఇచ్చింది. శుక్రవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ముంబై పోలీసులు కేసు నమోదు చేసి 17 మంది సేన కార్యకర్తలను అరెస్టు చేసిన విషయం తెల్సిందే.
వీరిని శనివారం విక్రోలీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్ రెండు రోజుల పోలీసు కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. నిందితులందరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సోదరుడు సునీల్ రౌత్ ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు.
శివసేన చీఫ్ బాల్‌థాక్రేపై విమర్శలు చేస్తూ ఓ కథనాన్ని ప్రసారం చేయడంతో ఆగ్రహించిన సేన కార్యకర్తలు ఐబీఎన్ కార్యాలయంపై దాడులకు తెగబడిన విషయం తెల్సిందే. శుక్రవారం ఈ సంఘటన దేశ వాణిజ్యరాజధానిలో సంచలనం సృష్టించింది.