జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్ నోట "స్థానిక నినాదం" (Ashok Chavan | Maharashtra | CM | MNS | Rly | Sivasena | Sachin)
Feedback Print Bookmark and Share
 
మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కూడా స్థానిక నినాదాన్ని అందుకున్నారు. రైల్వే శాఖ ఖాళీల్లో స్థానికులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రైల్వే శాఖను కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.

అంతేకాకుండా, రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలను కూడా మాతృభాషలోనే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే "మరాఠా మానూస్" నినాదంతో ఎంఎన్ఎస్, శివసేన పార్టీలు మహారాష్ట్రలో హడలెత్తిస్తున్న విషయం తెల్సిందే.

తాజాగా, వారితో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కూడా శృతి కలిపడం గమనార్హం. సచిన్ టెండూల్కర్‌ను ఉద్దేశించిన శివసేన అధినేత బాల్‌థాక్రే చేసిన విమర్శలను ఖండించిన అశోక్ చవాన్ తాజాగా ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.