ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ప్రాంతీయ భాషల్లో కూడా రైల్వే పరీక్షలు: మంత్రి మమతా (Regionaal language | Rly exams | Mamata | Maharashtra | Marati | Chawan)
ప్రాంతీయ భాషల్లో కూడా రైల్వే పరీక్షలు: మంత్రి మమతా
ఆదివారం, 22 నవంబర్ 2009( 10:06 IST )
మహారాష్ట్ర రాజకీయ పార్టీల ఒత్తిడికి కేంద్ర రైల్వే శాఖ కూడా తలొగ్గింది. ఉద్యోగాల నియమాకాల్లో స్థానికులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌తో పాటు.. ప్రతిపక్ష పార్టీలైన శివసేన, ఎంఎన్ఎస్ వంటి పార్టీలు డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా, రైల్వే ఉద్యోగాల భర్తీకోసం నిర్వహిస్తున్న రాత పరీక్షలను కూడా ప్రాంతీయ భాషలోనే నిర్వహించాలని సీఎం అశోక్ చవాన్ కేంద్ర రైల్వే శాఖకు విజ్ఞప్తి చేశారు.
దీనిపై కేంద్ర రైల్వే మంత్రి స్పందించారు. రైల్వే పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహిస్తామని రైల్వే మంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఉత్తర భారతదేశం నుంచి రైల్వే పరీక్షలు రాయడానికి వస్తున్న అభ్యర్థులపై మహారాష్ట్ర సవనిర్మాణ్ సేన దాడులు చేస్తుండడంతో మమతాబెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆంగ్లం, హిందీ భాషలతో పాటు ప్రాంతీయ భాషలో కూడా ప్రశ్నపత్రం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహారాష్ట్రలో నిర్వహించే పరీక్షల్లో మరాఠీలో జరుగుతాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయా ప్రాంతీయ భాషల్లోనే నిర్వహిస్తామని మమతా బెనర్జీ వివరించారు.