రైతుల డిమాండ్ మేరకు చెరకుకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం తాత్సారం చేయడంలో ఆంతర్యంమేమిటని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ప్రశ్నించారు. మరికొన్ని రోజులు ఆలస్యం చేసి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని యూపీఏ ప్రభుత్వం భావిస్తోందని ఆమె ఆరోపించారు.
ఈ అంశంపై ఆమె తరపు ఆ పార్టీ ప్రధాన కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రభుత్వం కావాలని చక్కెర మద్దతు ధర ఉపసంహణ ఆర్డినెన్స్‌ను తాత్సారం చేస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
చక్కెర రైతుల డిమాండ్‌ను పక్షం రోజుల క్రితమే కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయితే, కేంద్రం మాత్రం కావాలనే తొక్కిపెడుతోందని ఆరోపించారు. డిమాండ్ మేరకు చక్కెర రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే మాయావతికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని కేంద్రం భయపడుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.