ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » రాజ్‌థాక్రేపై చర్యకు విశ్వహిందూ నేత డిమాండ్! (VHP | Hindi | Raj Thackeray | Demands | Anti Hindi stance | MNS | Sena)
జాతీయ భాష హిందీని వ్యతిరేకించిన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌థాక్రేపై కఠిన చర్య తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో దేశాన్ని విభజిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ.. హిందీ భాషను వ్యతిరేకిస్తూ దేశాన్ని రెండుగా విభజించాలని భావిస్తున్న రాజ్‌థాక్రే మనుగడ కొనసాగించలేరన్నారు. ఎవరైతే ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారో వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని ఆదివారం నాగ్‌పూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అభిప్రాయపడ్డారు.
జాతీయ భాష అయిన హిందీని వ్యతిరేకించడం క్షమార్హమన్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని సింఘాల్ డిమాండ్ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన ఎంఎన్ఎస్ ఎమ్మెల్యేలు హిందీలో ప్రమాణ స్వీకారం చేసిన ఎస్పీ సభ్యుడు అబూ అజ్మీపై దాడికి దిగిన విషయం తెల్సిందే.
దీనిపై సింఘాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్‌థాక్రే కేవలం హిందీ భాషనే కించపరచలేదని, జాతీయ భాషను అవమానరపరిచారని మండిపడ్డారు. దీన్ని సహించజాలమన్నారు. చిన్నపాటి గుర్తింపు కలిగిన రాజ్‌థాక్రే ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నారని ఆయన అన్నారు.