జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఉద్రిక్తలు పెంచడం నా లక్ష్యం కాదు: దలైలామా (Dalailama | India | China | Tibet | America | Arunachal | National)
Feedback Print Bookmark and Share
 
భారత్-చైనాల మధ్య ఉద్రిక్తలు పెంచడం తన లక్ష్యం కాదని టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా స్పష్టం చేశారు. గత ఆరు దశాబ్దాలుగా తనకు ఆతిథ్యం ఇచ్చిన భారత్‌ గత కొద్ది నెలలుగా చైనా పట్ల కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచడానికి తాను ఏ కోణంలోనూ దోహదం చేయటం లేదని, చేయబోనని ఆయన అన్నారు.

దేశ రాజధానిలో ఆయన ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన అరుణాచల్ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడం అర్థరహితమన్నారు. ఈ ప్రాంతాన్ని తాము దక్షిణ టిబెట్‌గా పరిగణిస్తామన్నారు. కాగా, తనకు ఆతిథ్యం ఇస్తున్న భారత్.. దేశంలోని ఎక్కడైనా పర్యటించేలా అనుమతి ఇచ్చిందని, అదే సమయంలో రాజకీయ ప్రకటనలు చేయరాదనే ఆంక్షలు విధించినట్టు దలైలామా గుర్తు చేశారు.

ప్రస్తుతం అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మన్మోహన్ సింగ్ టిబెట్ సమస్య పరిష్కారానికి అమెరికాతో చర్చించగలరనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అదేసమయంలో టిబెట్ చైనాలో అంతర్భాగమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన ప్రకటనపై తానేమీ వ్యాఖ్యానించబోన్నారు. అయితే చైనాపట్ల ఒబామా మెతక వైఖరి అవలంభించడంలేదని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.