జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » దేశంలోని ముస్లింలు కూడా హిందువులే: ఆర్ఎస్ఎస్ (RSS | Indian Muslims | Hindus | Christians | Mohan Bhagwat | BJP)
Feedback Print Bookmark and Share
 
భారతీయ ముస్లింలందరూ హిందువులేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి బెంగుళూరులో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఈ తరహా ప్రసంగం చేశారు.

భారతదేశం ఒక హిందూ దేశం. ఈ గడ్డపై నివశించే ముస్లింలు, క్రిస్టియన్లు కూడా హిందువులేన్నారు. హిందు సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తున్నందున వీరంతా నిజంగానే హిందువులేనన్నారు.

ముస్లింలకు చెందిన ముత్తాతలు భజనలు చేస్తూ, హిందూ సంస్కృతికీ సంప్రదాయాలను పాటించేవారన్నారు. మనది భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ అనేక జాతులు, మతాలు, భాషలు, భిన్న సంస్కృతులు, ఆహార అలవాట్లు ఉన్నాయి. భారతీయులందరూ హిందుత్వ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నారు. సనాతన ధర్మాలకు లోబడి వారు నడుచుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.