ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » బాబ్రీ మసీదు విధ్వంసంలో అటల్-అద్వానీ పాత్ర! (Babari masjid | demolition | liberahan report | Advani | Home ministry)
బాబ్రీ మసీదు కూల్చివేతలో భారతీయ జనతా పార్టీ అగ్రనేతలైన అటల్ బీహారీ వాజ్‌పేయి, ఎల్కే.అద్వానీల పాత్ర ఉన్నట్టు జస్టీస్ మన్మోహన్ సింగ్ లిబెర్హాన్ కమిషన్ తేటతెల్లం చేసింది. ఈ విషయాన్ని ఆ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. అయితే, లిబెర్హాన్ కమిషన్ లీక్ కావడం పట్ల భాజపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
1992 సంవత్సరం డిసెంబరు ఆరో తేదీన కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చి వేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో కేంద్రంలో పీవీ.నరసింహారావు ప్రభుత్వం ఉండగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కళ్యాణ్ సింగ్ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం ఉన్నది. దీంతో కరసేవకులు రెచ్చిపోయి మసీదును కూల్చివేశారు.
దీనిపై జస్టీస్ లిబెర్హాన్ కమిషన్‌ను కేంద్రం నియమించింది. దశాబ్ద కాలం పాటు విచారణ జరిపిన ఈ కమిషన్ ఇటీవల నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఇందులో మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి, అద్వానీ, మురళీ మోహన్ జోషీలతో పాటు.. మరికొంతమంది అగ్రనేతలు పేర్లను కమిషన్ చేర్చిందని రహస్య నివేదికలు పేర్కొంటున్నాయి.
బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందుగానే వ్యూహాన్ని రచించారని, అయితే, కూల్చివేత విషయం భాజపా అగ్రనేతలకు తెలిసి ఉండకపోవచ్చని నివేదిక పేర్కొన్నట్టు సమాచారం. కాగా, ఈ నివేదికను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బహిర్గతం చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలావుండగా, నివేదిక లీక్ కావడం పట్ల సోమవారం పార్లమెంట్ ఉభయ సభల్లో భాజపా సభ్యులు గందరగోళం సృష్టించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఎల్కే.అద్వానీ ఆగ్రహంగా ప్రసంగించారు.