జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » భారత సైనిక అమ్ముల పొదిలో అగ్ని-2 క్షిపణి! (Agni-2 | Orissa | DRDO | Indian | Ballistic Missile | Defense Program)
Feedback Print Bookmark and Share
 
భారత సైనికదళం అమ్ముల పొదిలో మరో క్షిపణి చేరింది. భూ ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని-2 మధ్య తరహా బాలిస్టిక్ క్షిపణిని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఒరిస్సా తీరంలోని వీలర్ దీవిలో ఉన్న బాలాసోర్ కేంద్రం నుంచి సోమవారం రాత్రి ఈ క్షిపణిని ప్రయోగం విజయంగా పూర్తి చేసినట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు.

రాత్రి సమయాలలో ప్రయోగించే క్షిపణులను రూపొందించడంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) విజయం సాధించిందని ఆ వర్గాలు వెల్లడించాయి. రాత్రి సమయాలలో 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సరిగ్గా ఛేదించే క్షిపణులను రూపొందించడం వల్ల సైన్యానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

రైలు, రహదారిపై నుంచి లేదా నడుస్తున్న వాహనాలు నుంచి ప్రయోగించే రీతిలో అగ్ని-2 క్షిపణి రూపకల్పన చేయడం గమనార్హం. 20 మీటర్ల పొడవు, 16 టన్నుల బరువుగల అగ్ని-2 క్షిపణి ద్వారా వెయ్యి కిలోల మందుగుండు సామగ్రిని ఏక కాలంలో వినియోగించవచ్చు. ఈ బరువును తగ్గిస్తే అగ్ని-2 క్షిపణి దూరం మూడు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదిస్తుందని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.