ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు: ముగిసిన తొలిదశ ప్రచారం (Jarkhand | Assembly | Election | Polling | Congress | JMM | BJP | EC)
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు: ముగిసిన తొలిదశ ప్రచారం
మంగళవారం, 24 నవంబర్ 2009( 09:43 IST )
జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది. రేపు (బుధవారం) 26 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. నక్సల్ ప్రాబల్య ప్రాంతం కావడంతో భారీ సంఖ్యలో సాయుధ బలగాలను కేంద్రం మొహరించింది.
మొత్తం 81 స్థానాలు కలిగిన అసెంబ్లీకి ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా తొలి దశకు బుధవారం పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో నలుగురు మాజీ మంత్రులు, ఆరుగురు మాజీ ఎంపిలు, ఒక మాజీ శాసనసభాపతితో పాటు 470 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు.. అజయ్ మఖన్, వీరభద్రా సింగ్‌లు ప్రచారం చేశారు. అలాగే, భారతీయ జనతా పార్టీ తరపున వెంకయ్య నాయుడు, జెడీయు అధ్యక్షుడు శరద్ యాదవ్, జేఎంఎం తరపున ఆ పార్టీ అధినేత శిబూ సోరెన్, జార్ఖండ్ వికాస్ మోర్చా చీఫ్ బాబూలాల్ మరాండీ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.