జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » నేడు పార్లమెంట్‌లో లిబర్హాన్ నివేదిక వెల్లడి: కేంద్రం (Liberhan report | Parliament | Babri Masjid | Advani | Chidambaram)
Feedback Print Bookmark and Share
 
ఎట్టకేలకు ప్రతిపక్షాల ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు కారకులను బయటపెట్టే లిబర్హాన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు నివేదికను సభ ముందు ప్రవేశపెడతామని కేంద్ర హోంశాఖ మంత్రి పి.చిదంబరం తెలిపారు. దీంతో అందరి దృష్టి ఈ నివేదికలో ఉన్న అంశాలపైనే కేంద్రీకృతమైవుంది.

1992 సంవత్సరం డిసెంబరు ఆరో తేదీన బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చి వేసిన విషయం తెల్సిందే. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి మన్మోహన్ సింగ్ లిబర్హాన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దశాబ్దకాలానికి పైగా విచారణ జరిపి తుది నివేదికను గత జూన్ 30వ తేదీన కేంద్రానికి సమర్పించింది.

అయితే, సోమవారం ఒక ఆంగ్లపత్రిక ఈ నివేదికలోని కొన్ని ఎంపిక చేసిన అంశాలను కథనంగా ప్రసురించింది. బాబ్రీ మసీదు కూల్చివేత అంశం ముందుగా తెలిసినప్పటికీ.. భాజపా అగ్రనేతలు వాజ్‌పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషీలు చూసీచూడనట్టుగా వ్యవహరించినట్టు ఆ కథనం సారాంశం. దీనిపై పార్లమెంట్ ఉభయసభలు సోమవారం దద్దరిల్లి పోయాయి.

సభా కార్యక్రమాలకు విపక్షాలు పదేపదే అడ్డుతగలడంతో కేంద్ర హోం మంత్రి చిదంబరం కల్పించుకుని నివేదికను ఈ సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు వెల్లడిస్తామని తెలిపారు. అయితే, మంగళవారం కూడా భాజపా నివేదికను బహిర్గతం చేయాలని పట్టుబట్టాయి. దీంతో కేంద్రం దిగవచ్చి మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.