జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » లిబర్హాన్ కమిషన్ బహిర్గతం: 26వ తేదీన సభలో చర్చ! (Liberhan report | Parliament | Babri Masjid | Demolition | ATR | Chidambaram)
Feedback Print Bookmark and Share
 
ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం లిహర్హాన్ కమిషన్ నివేదికను మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. నివేదికను కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం సభ ముందుకు తెచ్చారు. కాగా, ఈ నివేదికపై ఈనెల 26వ తేదీన పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చ జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి సునీల్ కుమార్ బన్సల్ తెలిపారు.

ఇదిలావుండగా, లిబర్హాన్ కమిషన్ లీకేజీపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన నివాసంలో అత్యవసరంగా పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన విషయం తెల్సిందే. ఆ తర్వాత మంగళవారం ఉదయం కేంద్ర మంత్రిమండలి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో సమావేశమై కమిషన్ వెల్లడిపై చర్చించింది.

ఇందులో హోం మంత్రి చిదంబరం, రక్షణ మంత్రి ఆంటోనీతో సహా ఇతర కేబినెట్ సహచరులు హాజరయ్యారు. ఆ తర్వాత మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సభ ముందు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఉభయ సభల్లో పాలక, విపక్ష పార్టీల సభ్యుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉభయ సభలను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.

కాగా, ఈ నివేదికలో 68 మంది పేర్లను ప్రస్తావించినట్టు సమాచారం. అంతేకాకుండా, మతవాద రాజకీయాల అడ్డుకట్టకు కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాలని జస్టీస్ లిబర్హాన్ సూచించారు. ముఖ్యంగా, భాజపా అగ్రనేత వాజ్‌పేయి చేసిన ఉద్వేగపూరిత ప్రసంగాలు ఒక కారణంగా ఇందులో ప్రస్తావించినట్టు సమాచారం. అలాగే, 1992లో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్ (భాజపా) కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదని పేర్కొన్నట్టు కొన్ని వర్గాలు వెల్లడించాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.