జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » అగ్ని-2 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విఫలం: డీఆర్‌డీవో (Agni | Test | Missile | Orissa | DRDO | Indian | Ballistic Missile | Night Trail)
Feedback Print Bookmark and Share
 
భారత సైనిక దళం ఉపయోగార్ధం సోమవారం రాత్రి ప్రయోగించిన క్షిపణి-2 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విఫలమైనట్టు భారత రక్షణ పరిశోధనా మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మంగళవారం ప్రకటించింది. భూ ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని-2 మధ్య తరహా బాలిస్టిక్ క్షిపణిని ఒరిస్సా తీరంలోని వీలర్ దీవి నించి ప్రయోగించారు.

ఇలాంటి తరహా క్షిపణిని రాత్రి పూట తొలిసారి ప్రయోగించారు. అయితే, నిర్ధేశిత లక్ష్యాలను ఈ క్షిపణి చేరుకోలేక పోయిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించారు. రాత్రి పూట 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సరిగ్గా ఛేదించే క్షిపణులను రూపొందించడం వల్ల సైన్యానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని భావించిన శాస్త్రవేత్తలు అగ్ని-2 క్షిపణిని తయారు చేశారు.

రైలు, రహదారిపై నుంచి లేదా నడుస్తున్న వాహనాలు నుంచి ప్రయోగించే రీతిలో దీని రూపకల్పన చేశారు. అయితే, దురదృష్టవశాత్తు ఈ ప్రయోగం విఫలమైనట్టు రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

యడం గమనార్హం. 20 మీటర్ల పొడవు, 16 టన్నుల బరువుగల అగ్ని-2 క్షిపణి ద్వారా వెయ్యి కిలోల మందుగుండు సామగ్రిని ఏక కాలంలో వినియోగించవచ్చు. ఈ బరువును తగ్గిస్తే అగ్ని-2 క్షిపణి దూరం మూడు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదిస్తుందని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. తొలి దశ ప్రయోగంలో పురోగతి కనిపించినప్పటికీ.. రెండో దశలో ఈ క్షిపణి ప్రయోగం పూర్తిగా విఫలమనట్టు వర్గాలు తెలిపాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.