జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » పాక్-ఆఫ్ఘన్‌లు ఉగ్రవాద కేంద్ర బిందువులు: ఆంటోనీ (Pak | Afghanistan | Terrorism | Antony | Deffence | International | Summit)
Feedback Print Bookmark and Share
 
ఉగ్రవాద కేంద్ర బిందువులుగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలు ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ అన్నారు. ఈ రెండు దేశాల్లో తిష్టవేసిన ఉగ్రవాదులు ప్రపంచాన్ని శాసిస్తన్నారన్నారు. న్యూఢిల్లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో మంత్రి ఆంటోనీ పాల్గొని ప్రసంగించారు.

పాకిస్థాన్‌లో పెచ్చు పెరుగుతున్న ఉగ్రవాద దాడులు ఆ దేశ అణ్వస్త్రాల రక్షణకు సంబంధించి ఆందోళన కలిగిస్తున్న అంశమన్నారు. ఈ అణ్వస్త్రాలు ఉగ్రవాద ముష్కరుల చేతిలో పడితే ఊహించనటువంటి పరిణామాలు ఎదురవుతాయన్నారు. ఉగ్రవాద ప్రభావానికి గురికాని దేశంగానీ, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంతో ప్రమేయం లేని దేశంగానీ లేదని గుర్తు చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా ఇటీవలి కాలంలో ఉగ్రవాద సంబంధ సంఘటనలు విచ్చలవిడిగా చోటుచేసుకుంటున్నాయని, ముఖ్యంగా దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలలో వీటి ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. గడచిన కొద్ది మాసాలుగా మన ఇరుగుపొరుగు దేశలలో ప్రధానంగా పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌లలో పరిణామాలు తీవ్రతరమైన ఆందోళనలు కలిగిస్తున్నాయన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.