జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం: మంత్రి మొయిలీ (Moily | Kalyan Singh | Babri Moque | Liberhan | Parliment)
Bookmark and Share Feedback Print
 
లిబర్హాన్ కమిషన్ సూచించిన సూచనల మేరకు సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకుంటాయని కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. లిబర్హాన్ కమిషన్‌లో పేర్కొన్న అంశాలపై ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... లిబర్హాన్ కమిషన్ పేర్కొన్న అంశాలను కేంద్రం పరిశీలిస్తోందన్నారు.

వీటిపై కూలంకుషంగా చర్చించి ఆయా మంత్రిత్వ శాఖలు చర్యలు తీసుకుంటాయన్నారు. కాగా, ఈ నివేదికలో 65 మందిపై అభియోగాలు మోపినట్టు మంత్రి ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ఇదే అంశంపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ మాట్లాడుతూ.. బాబ్రీ విధ్వంసం వ్యవహారంలో తన పేరుతో పాటు మాజీ ప్రధాని వాజ్‌పేయి పేరును ప్రస్తావించండం దురదృష్టకరమన్నారు. 1992 డిసెంబరు 6వ తేదీన అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించామన్నారు.

అయినప్పటికీ, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం సహజమేనన్నారు. అదేసమయంలో ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే తాను పోలీసు కాల్పులకు అనుమతించలేదని సింగ్ చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.