జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » జార్ఖండ్‌లో ప్రారంభమైన తొలి దశ ఎన్నికల పోలింగ్! (Election | First phase | Voting | Polls | Candidates | EVM's | Security)
Bookmark and Share Feedback Print
 
జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బుధవారం ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీవినీ ఎరుగని రీతిలో సాయుధ బలగాలను మొహరించారు.

మొత్తం 81 స్థానాలు కలిగిన జార్ఖండ్ అసెంబ్లీకి మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. తొలి దశలో 26 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో 194 మంది స్వతంత్ర అభ్యర్థులతో పాటు.. 470 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

26 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 8176 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయగా, 13850 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. మొత్తం 6532234 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

తొలిదశ పోరులో జార్ఖండ్ రాష్ట్ర భాజపా శాఖ అధ్యక్షుడు రఘుబర్ దాస్, జనతాదళ్ యు అధ్యక్షుడు జలేశ్వర్ మహతో, కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు ప్రదీప్ బల్ముచు‌లతో పాటు.. మరికొందరు ప్రముఖులు, మాజీ మంత్రులు ఉన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.