జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఉదారవాద ముసుగులో ఉన్న నేతలు: లిబర్హాన్ నివేదిక (Liberhan | Advani | Babri demolish | Parliment | UPA Govt)
Bookmark and Share Feedback Print
 
భారతీయ జనతా పార్టీలోని అగ్రనేతలు ఉదారవాద ముసుగులో ఉన్న రాజకీయనాయకులని జస్టీస్ మన్మోహన్ సింగ్ లిబర్హాన్ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. దేశాన్ని మత ఘర్షణల అంచుల్లోకి తీసుకెళ్లిన వీరూ అపరాధులే అని బాబ్రీ మసీదు కూల్చివేత వ్యవహారంపై సమర్పించిన తుది నివేదికలో పేర్కొంది. 1992 డిసెంబరు ఆరో తేదీన అయోధ్యలోని బాబ్రీ మసీదు కట్టడాన్ని కూల్చి వేసిన విషయం తెల్సిందే.

ఈ అంశంపై 17 సంవత్సరాల విచారణ జరిపిన లిబర్హాన్ కమిషన్ సమర్పించిన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్‌ ముందు ఉంచింది. ఇందులో భాజపాకు చెందిన అగ్రనేతలు వాజ్‌పేయి, అద్వానీ, మురళీమనోహర్ జోషీ, కళ్యాణ్ సింగ్, బాల్తాక్రే, ఉమాభారతి, ఆచార్య గిరిరాజ్ కిషోక్, శంకర్ సింగ్ వాఘేలా, ప్రవీణ్ తొగాడియా, సింఘా, వినయ్ కతియార్, అశోక్ సింఘాల్, లాల్జీ టాండన్, సుదర్శన్‌లతో పాటు.. అప్పటి యూపీ ప్రభుత్వ అధికారుల్లో కొంతమంది పాత్ర ఉన్నట్టు తేల్చింది.

వీరితో సహా మొత్తం 68 మందిపై అభియోగాలు మోపింది. భాజపా నేతలు వాజ్‌పేయి, అద్వానీ, మురళీమనోహర్ జోషీలు ఉదారవాద ముసుగు వేసుకున్న రాజకీయ నాయకులని పేర్కొంది. ప్రజాస్వామ్య దేశంలో ఇంతకంటే గొప్ప నమ్మక ద్రోహం కానీ, నేరం కానీ మరొకటి ఉండబోదని పేర్కొంది. అయితే, ఈ కుహానా రాజకీయ నేతలు ఉద్దేశ పూర్వకంగా చేసిన పాపాలను లిబర్హాన్ కమిషన్ తీవ్రంగానే ఖండించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.