జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఉత్తరప్రదేశ్‌లో ఢీకొన్న రైళ్లు: పలువురికి గాయాలు! (Train collision | Kanpur | Etawah | UP | People | Feared | Magadh Exp)
Bookmark and Share Feedback Print
 
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. రైలు పట్టాలపై నిలబడి ఉన్న రైలును వెనుకనుంచి వచ్చిన మరొక రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. దట్టమైన పొంగమంచు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకునట్టు ప్రాథమిక సమాచారం.

శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బిహార్ నుంచి వస్తున్న లిచావి ఎక్స్‌ప్రెస్ రైలు, ఢిల్లీ-ఇస్లామ్‌పూర్‌ మధ్య నడిచే మగధ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఎతవా సమీపంలోని సరోభోపాట్ వద్ద ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని, అయితే పలువురు గాయపడినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిల్ లిచావి ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ ఉన్నారు. ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే కాన్పూర్ నుంచి ఎతవాకు రిలీఫ్ ట్రైను బయలుదేరి వెళ్లింది.

కాన్పూర్ జిల్లాలో ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గోరఖ్‌నాథ్ ఎక్స్‌ప్రెస్, ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పంకీ వద్ద ఢీకొన్న విషయం తెల్సిందే. ఈ ప్రమాదంలో ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు చివరి బోగీ బాగా దెబ్బతింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.