జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఛోటా రాజన్ విందు పార్టీ: ముంబై ఏసీపీపై సస్పెన్షన్! (Chota rajan | Party | Mumbai | ACP | Suspend | Prakash Vani)
Bookmark and Share Feedback Print
 
మాఫియా డాన్ ఛోటా రాజన్ గ్యాంగ్ ఇచ్చిన క్రిస్మస్ విందు పార్టీకి హాజరై చిందులు వేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై మహానగర్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ప్రకాష్ వాణీపై ముంబై నగర పోలీసు యంత్రాగం వేటు వేసింది. అలాగే, మరో ఐపీఎస్ అధికారితో పాటు.. ముగ్గురు సీనియర్ ఇన్‌స్పెక్టర్లు కూడా సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.

ఈ మేరకు ముంబై పోలీసు కమిషనర్ డి.శివానంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సీసీ టీవీ ఫుటేజ్, ఫోటోల ఆధారంగా వీరిపై క్రమశిక్షణ చర్య చేపట్టారు. వివిధ కేసుల్లో దోషిగా తేలి 13 సంవత్సరాల పాటు శిక్షను అనుభవించి ఇటీవలే జైలు నుంచి విడుదలైన ముఖ్య అనుచరుడు డీకే.రావు ముఖ్యఅతిథిగా ఛోటారాజన్ ఈ విందు పార్టీ ఇచ్చారు.

ముంబై నగర శివారు ప్రాంతాల్లో జరిగిన ఈ పార్టీలో ఏసీపీ ప్రకాష్ వాణీతో పాటు.. కొంతమంది పోలీసు అధికారులు హాజరైనట్టు సమాచారం. ఈ పార్టీకి హాజరైన వారిలో విందులో ఏసీపీ పీకలదాక దాకి చిందులేస్తుండగా వీడియో తీసి టీవీలకు విడుదల చేశారు. దీంతో ఏసీపీ బండారం ఒక్కసారి వెలుగులోకి వచ్చింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.