ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ముగ్గురు తీవ్రవాదుల పరారీ: ఢిల్లీలో హై అలెర్ట్! (Delhi | Pak terrorists | High alert | Police | Hospital | Narcotic)
ఎర్రకోట దాడిలో సంబంధం ఉన్న ముగ్గురు తీవ్రవాదులు ఢిల్లీ ఆస్పత్రి నుంచి పరారు కావడంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో హైఅలెర్ట్ ప్రకటించారు. అలాగే, పరారీలో ఉన్న ముగ్గురు తీవ్రవాదుల ఆచూకీ తెలిపిన వారికి యాభై వేల రూపాయల నగదు బహుమతిని అందజేయనున్నట్టు హస్తిన పోలీసులు ప్రకటించారు.
తొమ్మిది సంవత్సరాల క్రితం ఎర్రకోటపై జరిగిన దాడి కేసులో పాకిస్థాన్ జాతీయులైన అబ్దుల్ రజాక్, మొహ్మద్ సాధిక్, రఫాకత్ ఆలీలను పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందతూ భద్రతగా ఉన్న పోలీసుల కన్నుగప్పి పరారయ్యారు. ఈ తీవ్రవాదులు మేఘాలయ పోలీసుల రక్షణలో ఉన్నారు. ఈ ముగ్గురు తీవ్రవాదులు నార్కాటిక్, డ్రగ్ అండ్ సైకోట్రాఫిక్ సబ్‌స్టెన్స్ యాక్ట్ కింద దోషులుగా తేలారు.
ఆ తర్వాత ఈ ముగ్గురు తమ శిక్షలను కూడా పూర్తి చేయడంతో వీరిని పాకిస్థాన్‌కు పంపాల్సి ఉంది. ఈ తరుణంలో వారు ఆస్పత్రి నుంచి పరారు కావడం రాజధానిలో సంచలనం సృష్టించింది. దీనిపై ఢిల్లీ పోలీసు యంత్రాంగ ప్రతినిధి రాజన్ భాగత్ మాట్లాడుతూ.. వీరిని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉంచామని, వీరికి మెడికల్ చెకప్ చేసి తిరిగి తీసుకొస్తుండగా పరారైనట్టు తెలిపారు.