జార్ఖండ్ రాష్ట్రంలో చలికి 13 మంది మృత్యువాత పడ్డారు. ఆ రాష్ట్ర రాజధాని రాంచీతో పాటు.. వివిధ ప్రాంతాల్లో వీరంతా మరణించినట్టు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. రాంచీలో నలుగులు, బొకారో, గార్‌వాగ్, జమ్‌షెడ్‌పూర్‌లలో ఒక్కొక్కరు చొప్పున మరణించగా, హజీరాబాగ్, ధన్‌బాద్‌లలో ఆరుగురు ఆరుగురు ఉన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి.
రాష్ట్రంలో మరికొన్ని రోజులు వాతావరణ పరిస్థితులు కూడా ఇలాగే ఉంటాయని స్థానికి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలావుండగా, దేశ రాజధాని న్యూఢిల్లీలో కూడా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి, ముఖ్యంగా, దట్టమైన పొంగమంచు వల్ల విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఫలితంగా రాజధానికి వచ్చే విమానాలు గంటలకొద్ది ఆలస్యంగా నడుస్తున్నాయి.