ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » పాక్‌తో చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయి: కృష్ణ (Krishna | Doors | talks | never shut | Pakistan | Chidambaram)
పాకిస్థాన్‌తో చర్చలకు జరిపేందుకు తలపులు మూసి వేయలేదని కేంద్ర విదేశాంగమంత్రి ఎస్ఎం.కృష్ణ తెలిపారు. అయితే, ఇస్లామాబాద్ వెళ్లే కేంద్ర మంత్రి చిదంబరం చర్చలు జరిపే విషయాన్ని ఆయన నిర్ధారించలేదు. అలాగే, పాకిస్థాన్ తీవ్రవాదంపై దృఢమైన వైఖరిని అవలంభించనంత వరకు తమ వైఖరిలో మార్పు ఉండబోదని ఆయన తేల్చి చెప్పారు.
సార్క్ సదస్సు కోసం కేంద్ర హోం మంత్రి చిదంబరం ఇస్లామాబాద్‌కు వెళ్లే అవకాశం ఉంది. దీనిపై మంత్రి కృష్ణ స్పందిస్తూ పాక్‌తో చర్చల కోసం తలుపులు మూసి వేయలేదన్నారు. ప్రధానంగా పాక్ గడ్డపై ఉన్న తీవ్రవాదం, తీవ్రవాద స్థావరాలను మూసి వేయాలని చేస్తున్న డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదన్నారు. పాక్‌లో ఉన్న తీవ్రవాద శిబిరాలు ఆందోళన కలిగించే అంశమన్నారు.
ముంబై దాడుల కేసుల్లో సూత్రధారులుగా భావిస్తున్న నిందితులు పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, వారిని చట్టం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని రకాల ఆధారాలను పాక్‌కు సమర్పించినట్టు గుర్తు చేశారు. వీటి ఆధారంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కృష్ణ కోరారు.