జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీ! (Sri Krishna | Telangana | Committee | Chidambaram | United Andhra)
Bookmark and Share Feedback Print
 
తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమం నేతృత్వంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వం వహిస్తారు. మిగిలిన నలుగురు సభ్యుల్లో ఆర్థిక, న్యాయ నిపుణులు ఉన్నారు. వీరిలో ప్రొఫెసర్ రణబీర్ సింగ్, అబూసలే షరీఫ్, రవీందర్ కౌర్, వినోద్ దుగ్గల్‌లు ఉన్నారు.

ప్రధానంగా తెలంగాణ పేరును ప్రస్తావించకుండానే ఈ కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. అలాగే, కమిటీ విధి విధానాలు, కాలపరిమితి, తదితర అంశాలను కూడా వెల్లడించలేదు. వీటితో పాటు కమిటీ తెలంగాణ అంశాన్ని ఇవ్వాలా లేదా అనే అంశాన్ని కూడా ఖరారు చేసే అధికారం కూడా ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర ఇవ్వడం లేక ఇవ్వక పోవడం అనేది కేంద్రమే నిర్ణయించనుంది.

ఈ కమిటీ కేవలం ప్రస్తుతం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు మాత్రం ఏర్పాటు చేయడం గమనార్హం. కాగా, ఈ కమిటీపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తుండగా, తెదేపా నేతలు వ్యతిరేకిస్తున్నారు. జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం తమకు ఇష్టం లేకపోయినా.. చిదంబరం పర్యవేక్షణలో కమిటీ ఉండటాన్ని మాత్రం తాము అంగీకరించబోమని తెదేపా నేత మైసూరా రెడ్డి స్పష్టం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.