జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ముంబై ధర్మశాల కాదు.. రాహుల్‌కు శివసేన జవాబు! (Mumbai | Dharmasala | Samna | Sivasena | Congress | Maharashtra)
Bookmark and Share Feedback Print
 
ముంబై భారతీయులందరిదీ అని కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై శివసేన మండిపడింది. ముంబై ధర్మశాల కాదని అభిప్రాయపడింది. ముఖ్యంగా, ముంబై నగరం భారతీయులందరికీ చెందవచ్చు. కానీ.. ఇటలీ మమ్మీకి మాత్రం చెందదు అని ఆ పార్టీ పత్రిక సామ్నాలో చీఫ్ శివసేన బాల్‌థాక్రే రాసిన సంపాదకీయంలో ఘాటుగా విమర్శలు గుప్పించారు.

ముఖ్యంగా, ప్రతి ఒక్కరూ ఆశ్రయం పొందడానికి ముంబై ధర్మశాల కాదని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తీవ్రమైన నైరాశ్యంలో ఉన్నారని ఆయనకు మహారాష్ట్రపైనా, మరాఠీ ప్రజలపైనా ఆయనకు ఏ మాత్రం గౌరవం లేదని థాక్రే ఆరోపించారు.

రాహుల్ వ్యాఖ్యానించినట్లు మంబైకు అందరూ రావడానికి ఇది ధర్మశాల కాదన్నారు. 1920లో ప్రత్యేక మహారాష్ట్ర సాధన ఉద్యమంలో 105 మంది ప్రజలు ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. 105 మంది అమరవీరులైనది ముంబైని ధర్మశాల చేయడానికి కాదని థాకరే అన్నారు.

భారత్‌లోని ప్రతీ భూభాగం అందిరికీ చెందుతుందని, ఎక్కడి వారు ఎక్కడికైనా వెళ్లవచ్చని రాహుల్ గాంధీ మంగళవారం చేసిన వ్యాఖ్యాలపై శివసేనకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. ముంబై నగరం అందిరిదీనని, 26/11 దాడులు జరిగినపుడు బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలకు చెందిన వారు పోరాడి ప్రాణాలర్పించారన్న రాహుల్ వ్యాఖ్యలపై థాక్రే పై విధంగా వ్యాఖ్యానించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.