జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మహారాష్ట్రలో 1135 మందికి నకిలీ సర్టిఫికేట్లు (Students | Jobs | Maharashtra, Fake marksheets | CBI report)
Bookmark and Share Feedback Print
 
మహారాష్ట్రలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 1135 మంది విద్యార్థులు నకిలీ సర్టిఫికేట్లను సమర్పించి ఉద్యోగాలు పొందినట్టు సీబీఐ ఒక నివేదిక సమర్పించింది. ఈ నకిలీ సర్టిఫికేట్లన్నీ వివిధ విశ్వవిద్యాలయాల నుంచి మజూరు చేసినవిగా సీబీఐ గుర్తించింది.

2007లో బాంబే హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మేరకు నకిలీ సర్టిఫికేట్లపై కోర్టు సీబీఐ విచారణకు దేశించింది. ప్రభుత్వ కొలువులతో పాటు ప్రైవేట్ సెక్టార్లలో అనేక మంది నకిలీ సర్టిఫికేట్లు సమర్పించి, ఉద్యోగాలు పొందిన్టటు పిల్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణకు ఆదేశించాలని కోరారు.

పిల్‌పై విచాణ జరిపిన బాంబే హైకోర్టు నకిలీ సర్టిఫికేట్ల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో సర్టిఫికేట్ల పరిశీలనార్ధం మహారాష్ట్రలోని అన్ని వర్శిటీలకు సీబీఐ 2009 డిసెంబరు 26వ తేదీన లేఖలు రాసింది. ఈ పరిశీలన పుణ్యమాని మహారాష్ట్రలో 1135 మంది విద్యార్థులు నకిలీ సర్టిఫికేట్లు ఉన్నట్టు కనుగొన్నారు.

2001-2007 మధ్యకాలంలో ఈ సర్టిఫికేట్ల చెలామణి ఎక్కువగా జరిగినట్టు గుర్తించినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సర్టిఫికేట్లలో ఎక్కువగా పూణె విశ్వవిద్యాలయం నుంచి జారీ అయినట్టుగా గుర్తించారు. ఈ ఒక్క విశ్వవిద్యాలయంలోనే 729 సర్టిఫికేట్లు జారీ అయ్యాయి.

ఆ తర్వాత ముంబై వర్శిటీలో 237, తుక్డోజీ మహారాజ్ వర్శిటీ (నాగ్‌పూర్)లో 92, కోల్హాపూర్‌లోని శివాజీ వర్శిటీలో 42, ఔరంగబాద్‌లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్శిటీ నుంచి 18, అమరావతిలోని గద్గేగా వర్శిటీలో 17 నకిలీ సర్టిఫికేట్లు జారీ అయినట్టు గుర్తించారు. ఈ నకిలీ సర్టిఫికేట్ల కుంభకోణంపై సీబీఐ కోర్టుకు నివేదిక సమర్పించనుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.