జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » షారూక్ ఖాన్ ఒక ద్రోహి: శివసేన చీఫ్ బాల్ థాక్రే (Sharuk khan | Sivasena | Bala Thackeray | My name is Khan | Samnaa)
Bookmark and Share Feedback Print
 
బాలీవుడ్ సినీ నటుడు షారూక్ ఖాన్ ఒక ద్రోహిగా శివసేన పార్టీ అభివర్ణించింది. ఆ హీరో నటించి, త్వరలో విడుదల కానున్న "మై నేమ్ ఈజ్ ఖాన్" అనే చిత్రం విడుదలను తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకోబోరని ఆ పార్టీ చీఫ్ బాల్‌థాక్రే స్పష్టం చేశారు.

శివసేన పార్టీ పత్రిక సామ్నాలో ఆయన మరో సంపాదకీయం రాశారు. ఇటాలీ మమ్మీ (సోనియా), యువరాజు (రాహుల్)ల సహకారంతో షారూక్ ఖాన్ తన చిత్రాన్ని విడుదల చేస్తున్నారన్నారు. ఈ చిత్రాన్ని ముంబైలో కాకుండా, దేశంలో ఏ ప్రాంతంలోనైనా విడుదల చేసిన తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకోబోరన్నారు.

తన పేరులో ఖాన్‌ను జత చేసుకున్న షారూక్ ఖాన్ పాకిస్థాన్‌ను ప్రేమించాలని కోరుకుంటున్నారని, భరతమాత గడ్డపై ఉంటూ.. ఈ దేశానికి చేస్తున్న ద్రోహంగా దీన్ని పరిగణిస్తున్నట్టు థాక్రే పేర్కొన్నారు.

త్వరలో జరుగనున్న ఐపీఎల్ మూడో అంచె పోటీల్లో పాకిస్థాన్ ఆటగాళ్లకు చోటు కల్పించక పోవడం పట్ల షారూక్ విచారం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఆటగాళ్ల సామర్థ్య వంతులైతే, ఆ ఆటగాళ్లు ఏ దేశం వారు అనే విషయాన్ని పరిగణంలోకి తీసుకోకుండా తన జట్టులో స్థానం కల్పిస్తానని అన్నారు. దీనిపై థాక్రే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.