ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » హర్యానా మాజీ డీజీపీ రాథోర్‌పై దుండగుడి దాడి! (Ruchika | molestation case | Rathore | Knife attack | Haryana | Ex DSP)
లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన హర్యానా మాజీ డీజీపీ ఎస్పీఎస్.రాథోర్‌పై సోమవారం ఒక దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ఈ కేసు విచారణ నిమిత్తం రాథోర్ కోర్డుకు హాజరవుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. దాడి చేసిన యువకుడిని పోలీసులు తక్షణం అపుదులోకి తీసుకున్నారు.
రుచిక లైంగిక వేధింపుల కేసులో స్థానిక కోర్టు ఆరు నెలల జైలు శిక్షను విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పంచకుల కోర్టులో అప్పీలు చేశారు. ఈ కేసు విచారణకు హాజరయ్యేందుకు సోమవారం రాథోర్ కోర్టుకు వచ్చారు. కోర్టు విచారణ పూర్తయిన తర్వాత కారు ఎక్కేందుకు వెళుతున్నారు.
ఆ సమయంలో 25 సంవత్సరాల వయస్సున్న గుర్తు తెలియని యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాటిలో రాథోర్ ముఖంపై స్వల్పంగా గాయలయ్యాయి. రాథోర్‌పై యువకుడి దాడిని కొన్ని టీవీ ఛానల్స్ చిత్రీకరించి, ప్రసారం చేశాయి.
ఈ దాడిలో గాయపడిన రాథోర్‌ను చంఢీగర్‌లోని సెక్టార్ 16 ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. అయితే, ఈ దాడికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. అరెస్టు చేసిన యువకుడిని రాథోర్ భద్రతా సిబ్బంది తక్షణం అరెస్టు చేశాయి. దాడి వివరాల కోసం ఆ యువకుడి వద్ద విచారణ జరుపుతున్నారు.