బాలీవుడ్ సినీ నటుడు షారూక్ ఖాన్ పాకిస్థాన్ తీవ్రవాదులకు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలకు పాకిస్థాన్ క్రికెట్ ఆటగాళ్లకు కూడా చోటు కల్పించి ఉంటే బాగుండు అని వ్యాఖ్యానించడంలో ఆంతర్యమేమిటని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా ప్రశ్నించారు.
దీనిపై ఆయన గౌహతిలో మాట్లాడుతూ.. పాక్ ఆటగాళ్లకు మద్దతుగా షారూక్ చేస్తున్న వ్యాఖ్యలను ఇప్పటికైనా మానుకోవాలని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముంబై నగరంతో పాటు మహారాష్ట్ర కూడా భారతీయులందరికీ సొంతమని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ఏ ఒక్కరూ హక్కు కోరడాన్ని తాము సహించజాలమన్నారు.
బంగ్లాదేశ్ నుంచి అనేక మంది ప్రజలు అస్సోం రాష్ట్రానికి వస్తున్నారన్నారు. వీరి గురించి కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం స్పందించడం లేదన్నారు. వారి ఓట్ల కోసం వెంపర్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశీయుల గురించి పట్టించుకోవడం లేదని ప్రవీణ్ తొగాడియా ఆరోపించారు.