బీటీ వంకాయ వాణిజ్య సాగు అనుమతులను కేంద్రం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ వంకాయలపై జరుగుతున్న పరిశోధనలు, అధ్యయనాలు పూర్తయ్యాకే అనుమతులు మంజూరు చేస్తామని కేంద్రం మంగళవారం ప్రకటించింది.
అమెరికా తదితర ప్రపంచ దేశాల్లో నిషేధించిన బీటీ వంకాయ సాగుకు భారత్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేసిన విషయం తెల్సిందే. అయితే, దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. కేంద్ర పర్యావరణ శాఖామంత్రి జైరామ్ రమేష్ పలు ముఖ్య నగరాల్లో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ సమయంలోనూ రైతులు తీవ్ర వ్యతిరేకత తెలిపారు.
బీటీ వంకాయ సాగుకు దేశంలో అనుమతి ఇవ్వరాదని వారు గగ్గోలు పెట్టారు. వీటికి తోడు కొన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా విమర్శలు గుప్పించారు. దీంతో.. కేంద్రం వెనకడుగు వేయకతప్పలేదు.