ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » 'మైనేమ్ ఈజ్ ఖాన్'కు పూర్తి భద్రత: ముంబై కాప్స్ (Mumbai | Police | Assure | Karan Johar | My name is khan | Release)
బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ నటించి, ఈనెల 12వ తేదీన విడుదల కానున్న "మైనేమ్ ఈజ్ ఖాన్" అనే చిత్రానికి పూర్తి భద్రత కల్పించనున్నట్టు ముంబై పోలీసు కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఆయనను కలిసిన ఆ చిత్ర ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహార్‌కు ఆయన హామీ ఇచ్చారు.
ఈ చిత్ర హీరో షారూక్ ఖాన్ పాకిస్థాన్ ఆటగాళ్లకు మద్దతు ప్రకటించి, శివసేన ఆగ్రహానికి గురైన విషయం తెల్సిందే. దీంతో ఆ చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని సేన ప్రకటించింది. దీంతో ఈ చిత్రం విడుదల అనుమానాస్పదంగా మారింది.
ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు కరణ్ జోహార్, చిత్ర డిస్ట్రిబ్యూటర్, మల్టీప్లెక్స్ థియేటర్ యజమానులతో కలిసి వెళ్లి ముంబై పోలీసు కమిషనర్ శివానందన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
దీనికి సానుకూలంగా స్పందించిన కమిషనర్ పూర్తి స్థాయి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ చిత్రం విడుదలయ్యే అన్ని ప్రాంతాల్లోని థియేటర్ల వద్ద పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని శివానందన్ సాహెబ్ హామీ ఇచ్చారన్నారు. అందువల్ల ఈ చిత్రం విడుదలలో ఎలాంటి సమస్య లేదని, అన్ని సరిగ్గా ఉన్నాయన్నారు.