జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » నిత్య "రాసలీలల" స్వామి నిత్యానంద: డ్రైవర్ లెనిన్ (Sex scandel | Nityananda swamy | News channels | South India | Gujarath | CM | Narendra Modi | Chennai | Ranjitha | Gopika | Lenin)
Bookmark and Share Feedback Print
 
ఇటీవల రాసలీలల వీడియోతో దక్షిణ భారత వార్తా ఛానెళ్ళలో దర్శనమిచ్చిన నిత్యానంద స్వామి నిత్యం రాసలీలల్లో మునిగి తేలేవాడని అతని కారు డ్రైవర్‌ లెనిన్‌ చెపుతున్నాడు. గతంలో నిత్యానంద స్వామిని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి దర్శించుకుని ఆయన కాళ్లు మొక్కి ఆశీర్వచనాలు తీసుకున్నట్లు లెనిన్ తమ విచారణలో వెల్లడించినట్లు చెన్నై పోలీసులు తెలిపారు.

తమిళ సినీ రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న సినీనటి రంజితతో నిత్యానంద స్వామి రాసలీలల వీడియోని 2009 డిసెంబరు 23, 24, 25 తేదీలలో చిత్రీకరించినట్లు పోలీసుల విచారణలో తెలిపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. భద్రతా కారణాల రీత్యా సిడిని ఆలస్యంగా విడుదల చేసినట్లు చెప్పారు. వీడియోలో ఉన్న రెండవ మహిళ ఆశ్రమ మహిళా కార్యదర్శి గోపిక అని తెలిపారు.

విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కెమెరాతో తాను ఆయన రాసలీలలు చిత్రీకరించినట్లు లెనిన్‌ తెలిపారు. తన ఆధ్యాత్మిక ప్రవచనాలకు ఆకర్షితులై నిత్యానందస్వామి వద్దకు వచ్చే ఎందరో మహిళలతో ఆయనకు శారీరక సంబంధాలున్నాయని లెనిన్ పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం లెనిన్‌ తమ రక్షణలోవున్నాడని, లెనిన్ చెప్పిన అంశాలపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వర్గాలు తెలిపాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.