ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » దేశ రాజధానిలో ప్రారంభమైన తెలంగాణ జాతర (Capital | Delhi | Telangana Jatara | Culture | MP | MLC | Vivek | Dilip kumar | JAC)
దేశ రాజధాని ఢిల్లీలో గురువారం తెలంగాణ జాతర అత్యంత ఘనంగా ప్రారంభమైంది.
తెలంగాణ గురించి ప్రత్యేకంగా దేశ రాజధానిలోని ప్రజలు, నాయకులకు తెలియజేసేందుకు తెలంగాణ జాతరను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ యువ ఐక్యకార్యాచరణ సమితి నాయకులు తెలిపారు. తెలంగాణ జాతరలో భాగంగా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఈ జాతర ఉంటుందని వారు తెలిపారు.
తెలంగాణ ప్రాంత సంస్కృతీ, సంప్రదాయాల్లో వైవిధ్యత, జీవనశైలిలోని విభిన్నతను ఢిల్లీ వేదికగా చాటేందుకేనని ఐకాస నాయకులు పేర్కొన్నారు. ఈ జాతరకు ఎంపీ వివేక్, ఎమ్మెల్సీ దిలిప్‌కుమార్ తదితర నాయకులు హాజరయ్యారు.
తెలంగాణ జాతర గ్రామ దేవతలు, పోతురాజులు, బోనాలు, బతుకమ్మ ఆట, సమ్మక్క, సారక్క గద్దెలు, కోయదొరల ఆటలు, పీర్ల పండుగ సంబరాలు, కళాకారుల ఆటపాటలతో జాతర ప్రాంగణం మారుమ్రోగుతోంది. ఈ జాతరను తిలకించేందుకు దేశంలోని పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా సందర్శిస్తున్నారు. అలాగే రేపు (శుక్రవారం) నాడు భాజపా సీనియర్ నాయకుడు ఎల్‌కే అద్వానీ తెలంగాణ జాతరను సందర్శించనున్నారని నిర్వాహకులు తెలిపారు.